10 August, 2026 | 10:34 PM

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

10-08-2026 09:19 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్ పల్లి పట్టణంలోని మిషన్ ఆసుపత్రిలో ఓ మహిళా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చించి మండలంలోని రాజేశ్వర్ రావు పేటకు చెందిన జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులు ప్రసవం కోసం సోమవారం ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు హెప్సిబా, గంగసాగర్ పర్యవేక్షణలో రాజ లక్ష్మి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో బాబు ఒక కేజీ ఎనిమిది వందల గ్రాములు బరువు ఉండగా, ఇద్దరు ఆడ పిల్లలు ఒక కేజీ ఐదు వందల గ్రాముల బరువుతో ఆరోగ్యం గా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు ఆరోగ్యం గా ఉన్నారు.