అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
10-08-2026 09:29 PM
కోహెడ,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్నట్లు ఎస్ఐ అభిలాష్ తెలిపారు. ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఓపెన్ ఫ్లాట్ గుడిసెలలో నివాసం ఉంటున్న పలువురు అక్రమ రేషన్ బియ్యంను నిల్వ చేసి ఉంచినట్లు పోలీస్ లకు సమాచారం అందటంతో తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. సుమారుగా ఐదు క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.






