మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌కు సన్మానం
11-07-2026 12:36 AM
అవార్డు మహోత్సవానికి ఆహ్వానం
ఎల్బీనగర్, జూలై 10 (విజయక్రాంతి): లెక్చరర్స్ కాలనీ డివిజన్‌లో మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జూలై 19న నిర్వహించనున్న అవార్డు మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ ఆహ్వానానికి మధు యాష్కీ గౌడ్ సానుకూలంగా స్పందించి కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ మహిళా ఇన్చార్జి పుష్ప నీలా గౌడ్, సీజీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఓబీసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ శ్రావణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై వారు చర్చించారు.






