20 May, 2026 | 2:36 AM

కల్లూరు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌కు సన్మానం

20-05-2026 12:00 AM

కల్లూరు, మే 19 (విజయక్రాంతి): కల్లూరు మున్సిపాలిటీ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ రాజశేఖర్కు మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్ సభ్యులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవల అందజేత, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారంలో తమవంతు సహకారం అందిస్తామని కౌన్సిలర్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ సిహెచ్ రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తూ, ప్రజాప్రతినిధులు,కౌన్సిలర్ సభ్యుల సహకారంతో కల్లూరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ ధారావత్ మోహన్ నాయక్,వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి, కౌన్సిలర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.