నామినేటెడ్ పదవులపై నాయకుల నజర్
బోథ్, జులై 19.( విజయక్రాంతి): త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం ప్రకటించడంతో నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఆశలు చిగురుస్తున్నాయి పార్టీ పదవులను దక్కించుకునేందుకు నాయకులు వారి వారి నమ్మిన నాయకులతో పైరవీలు చేయించుకుంటున్నారు
సహకార సంఘాల పైన దృష్టి
సహకార సంఘాల చైర్మన్ పదవులను సహితం నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తున్నట్లు తెలుస్తుండడంతో పదవులను దక్కించుకునేందుకు ఆ పార్టీ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. బోత్ నేరడిగొండ బజార్హత్నూర్ మండలాలలో సహకార సంఘం చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సహకార సంఘం అధ్యక్షునిగా ఎన్నికైతే జిల్లా సహకార సంఘం పదవిని రక్షించుకోవచ్చు అన్న లక్ష్యంతో పావులు కలుపుతున్నారు. నేరడిగొండ సహకార సంఘం చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీలో కీలక పార్టీ పదవిలో ఉన్న నాయకుడు ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇక బోత్ మండల సహకార సంఘం చైర్మన్ రేసులో ప్రస్తుతం ఉన్న సహకార సంఘం డైరెక్టర్ గొర్ల రాజు యాదవ్ తో పాటుగా చెట్ల రమేష్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బి ఆర్ ఎస్ లో నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సాయన్న సహితం పోటీలో ఉన్నట్లు తెలిసింది జిల్లా ఇన్చార్జి మంత్రి ఆశీస్సుల కోసం ఈ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి మాజీ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్ల ఆశీస్సులు ఉన్నవారికి పదవులు దక్కే ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బోథ్ సహకార సంఘం చైర్మన్ పదవి మంత్రి చేతుల్లో
బోథ్ సహకార సంఘం చైర్మన్ పదవిని పలువురు ఆశిస్తున్న ఆపద విషయంలో ఎవరు జోక్యం చేసుకోకూడదని ఇన్చార్జి మంత్రి పేర్కొన్నట్లు సమాచారం దీంతో పదవిని ఆశిస్తున్న నాయకుల్లో ఉత్కంఠత నెలకొంది. మంత్రి ఈ పదవిని ఎవరికి కట్టబెడతారో అంతు పట్టకుండా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు మరోవైపు వారు నమ్ముకున్న నాయకుల వద్ద మాత్రం పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది గ్రూపులుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు పైరవీలు చేస్తున్నారు.






