21 August, 2026 | 9:58 PM

Breaking News

గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •  

రాష్ట్ర అసోసియేషన్ పిలుపులో భాగంగా ఎరువుల దుకాణాలు సంపూర్ణ బంద్

27-04-2026 06:12 PM

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ఎరువుల దుకాణదారుల అసోసియేషన్ పిలుపులో భాగంగా సోమవారం ఆళ్లపల్లి మండలంలో ఎరువుల దుకాణాలు సంపూర్ణ బంద్  విజయవంతమైనది ఈ మేరకు మండల పరిధిలోని 22 ఎరువుల దుకాణదారులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దుకాణాలు బంద్ చేసి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారస్తులు గౌరిశెట్టి శ్రీనివాసరావు అబ్బు నాగేశ్వరరావు అనుమోల వెంకటేశ్వరరావు తాళ్లపల్లి నాగేశ్వరరావు బూరుగడ్డ రాముడు మాట్లాడుతూ... ఎరువుల ఉత్పత్తిదారులు ఎరువుల సరఫరాపై ఎఫ్ఓఎల్ విధానం అనగా రవాణాచార్జీలు హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఎరువుల సరఫరాలో యూరియా డిఎపి వాటితోపాటు లింకు విధానంతో వివిధ ఉత్పత్తులను అంట కట్టి ఇటు డీలర్లకు రైతులకు అదనపు భారం మోపటం సరైంది కాదని వెంటనే లింకు విధానాన్ని తొలగించాలని  అలాగే డీలర్లకు మార్జిన్ న పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.