27 April, 2026 | 8:50 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

27-04-2026 06:15 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ చీర కొంగు టిప్పర్ కు తగిలి టిప్పర్ కింద నలిగి మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం పెద్దూరు గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గట్టునెల్లికుదురు గ్రామానికి చెందిన వెంకటమ్మ(45) ద్విచక్ర వాహనంపై పెద్దూరు వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన ఒక టిప్పర్ అత్యంత సమీపంగా వేగంగా వెళ్తున్న క్రమంలో బైక్ పై వెనకాల కూర్చున్న మహిళ చీర కొంగు టిప్పర్ కు తగిలి కుప్పకూలింది. వెంటనే ఆ టిప్పర్ వెనక టైర్ కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.