calender_icon.png 30 December, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల దుకాణం వద్ద స్టాక్ బోర్డ్, ధరల పట్టికను ఏర్పాటు చేయాలి

30-12-2025 05:02:07 PM

సుల్తానాబాద్ మండల వ్యవసాయ అధికారి పైడితల్లి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఎరువుల అమ్మకందారులు విధిగా ఎరువుల దుకాణం వద్ద స్టాక్ బోర్డు, ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సుల్తానాబాద్ మండల వ్యవసాయ అధికారి పైడితల్లి అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నపల్లి రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి పైడితల్లి  ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలోని ఫెర్టిలైజర్ డీలర్స్, సొసైటీ సీఈవోలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పైడితల్లి మాట్లాడుతూ ప్రస్తుతం సుల్తానాబాద్ మండలoలో యూరియా నిల్వలు సరిపడ ఉన్నాయని,  కావున రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా యూరియా పంపిణీ చెయ్యాలి అన్నారు. ఫెర్టిలైజర్ బుకింగ్ అప్ లో యూరియా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈపీఓస్ లో ఎంటర్ చేసి యూరియా అమ్మాలని, అమ్మిన తర్వాత స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి, రసీదు ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు,  ఫెర్టిలైజర్ డీలర్స్ , సింగిల్ విండోలా సీఈవోలు పాల్గొన్నారు.