30-12-2025 04:59:01 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): మద్నూర్ మండలంలోని రాచూరు గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని, ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు శంకరావ్ ఎంపీడీవో రాణికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఎమ్మెల్యే ఎంపీడీవోకు ప్రభుత్వ స్థలం కబ్జాపై విచారణ చేపట్టడానికి ఆదేశించినట్లు ఫిర్యాదుదారుడు మంగళవారం తెలిపారు. అయితే ఈనెల 31న బుధవారం రాచూరు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపడతానని ఎంపీడీవో రాణి విలేకరులకు తెలిపారు.