24 June, 2026 | 2:42 PM

Breaking News

జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •  

ఫర్టిలైజర్ షాపుల బంద్ విజయవంతం

28-04-2026 12:27 AM

చేగుంట ఏప్రిల్ 27:  ఉత్పత్తిదారుల విధానాలను నిరసిస్తూ రాష్ట్ర ఫర్టిలైజర్స్ డీలర్ అసోసియేషన్ పిలుపు మేరకు చేగుంట లో మండల పెర్టీలైజర్  డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఎరువుల సరఫరాపై    ఎఫ్,పి,ఎల్ విధానాన్ని అమలు చేయాలని, లింక్ ప్రొడక్ట్ లేకుండా ఎరువులు అందించాలని, డీలర్లపై ఎరువులు, పురుగు మందుల స్టాక్ పాయింట్ నుండి తీసుకురావడానికి రవాణా ఖర్చులు డీలర్ల పై వేయడంతో, దానిని నిరసిస్తూ చేగుంట మండలంలోని పురుగుల మందు, ఎరువుల దుకాణ యజమానులు సోమవారం పట్టణ కేంద్రం లో షాపులు బంద్ చేశారు.

ఈ సందర్భంగా  అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు, ఎరువులు, ఫెర్టిలైజర్ షాపుల బంద్ నిర్వహించామని,కంపెనీలు ఎరువులు, పురుగు మందుల విషయంలో ఏదో ఒక లింకు పెట్టడాన్ని స్వస్తి పలకాలని, కంపెనీ లు అవలంబిస్తున్న విధానం తో రైతులపై అధిక భారం పడుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్లు మెదక్ రాములు, మిర్పకాయ వెంకటేషం, శ్రీకాంత్ యాదవ్, గంప రాజు, యట బాలకృష్ణ, గంప రాజు, ప్రశాంత్, గంగాధర్, బోయిని స్వామి, మహేష్, ఉప్పాల వెంకటేష్, నాగరాజు, రవి, రాజు, ప్రశాంత్, రాకేష్, రాజులింగం, సంజీవ్, అవినాష్, మధు, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.