29 August, 2026 | 1:09 AM

ఎమ్మెల్యేల ఇళ్లల్లో రాఖీ పండుగ సందడి

29-08-2026 12:00 AM

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాఖీ పండుగ వేడుకలు మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేల ఇళ్లల్లో సందడిగా మారాయి. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఇంట్లో రాఖీ పండుగ సందర్భంగా ఆయన సోదరీమణులు ఇందిరాబాయి, శకుంతల రాఖీ కట్టి ఆశీస్సులు అందజేశారు.

అలాగే మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కు ఆయన సోదరి సరోజిని రాఖీ కట్టారు. అలాగే మహబూబాబాద్ మాజీ ఎంపీ, జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత తన సోదరులకు రాఖీ కట్టడంతో పాటు మహబూబా బాద్ క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులకు రాఖీలు కట్టారు.