తప్పతాగి ఇద్దరిపై దాడి
దుబ్బాక / సిద్దిపేట, మే31(విజయక్రాం తి): తప్పతాగిన నలుగురు యువకులు మరో ఇద్దరు యువకులపై దాడి చేసి గాయపరిచిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో గురువారం రాత్రి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సిద్దిపేట ఏసీపీ మధు శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దుబ్బాక మం డలంలోని లచ్చపేట నుంచి కారులో వస్తు న్న విష్ణు, మహమ్మద్ రషీద్‌లను దుబ్బాక పట్టణంలోని గంగమ్మ గుడి వద్ద దేవుని రమణ, పరస భాస్కర్, రాచమాల్లు వినోద్, అలేటి శరత్‌లు వారి కారును అడ్డగించి, కారులోంచి వారిని బయటకు లాగి విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచి, కారును ధ్వంసం చేశారు. రషీద్ భార్య నస్రీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు నింధితులను శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారించారు. పాత కక్షల నేపథ్యంలోనే దాడి చేసిన ట్లు నిర్ధారించిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.






