22 July, 2026 | 6:58 AM

రైతులకు న్యాయం చేయాలి

01-06-2024 03:41 AM

మండల సభలో సమస్యలను ప్రస్తావించిన ఎంపీటీసీ సభ్యులు

పటాన్‌చెరు, మే 31 : ఎంపీపీ రవీందర్‌గౌడ్ అధ్యక్షతన జిన్నారం మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీవో సంతోష్‌కుమార్, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. జిన్నారం సర్వే నం బర్ 1లో రైతుల నుంచి తీసుకున్న రైతులకు న్యాయం  చేయాలని ఎంపీటీసీ లావణ్యనరేశ్ బాధిత రైతులతో కలిసి ఎంపీపీకి వినతి పత్రాన్ని అందజేసింది. అల్లీనగర్‌లోని బామ న కుంటలో మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేసిన ఆగడం లేదని, ఏమి చర్యలు తీసుకున్నారని ఎంపీటీసీ జనాబాయి ఆర్‌ఐ జయ ప్రకాశ్ నారాయణను ప్రశ్నించగా, పనులు నిలిపేశామని, కేసులు నమోదు చేస్తామని ఆయన సమాధానం చెప్పారు.

రాళ్లకత్వ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో నా లుగు నెలలుగా రాత్రిపూట మట్టి తవ్వకాలు జరిపి శివనగర్‌కు తరలిస్తున్నారని దీనిపై ఎలాంటి చర్యలు లేవని ఎంపీటీసీ సంతోష ఆర్‌ఐని అడుగగా దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గృహజ్యోతి అందరికీ రావడం లేదని, కరెంటు కోతలు ఈ మద్య అధికమవుతున్నాయని ఎంపీటీసీ వెంకటేశంగౌడ్ విద్యుత్ ఏఈని అడిగారు. రైతులకు రుణమాఫీ, రైతుబీమా, రైతుబంధు ఎందు కు అమలు కావడం లేదని ఎంపీటీసీ వెంకటేశంగౌడ్ వ్యవసాయాధికారిని ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి ఇంకా గైడ్‌లైన్స్ రాలేవన్నారు.

మంగంపేట గ్రామంలో నిర్మించిన డంప్‌యార్డును ఓ పరిశ్రమ కూల్చివేసిందని, దీనిపై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎంపీవోను ఎంపీటీసీలు నిలదిశారు. రెవెన్యూ అధికారులు 2019లో స్థలం కేటాయిస్తే ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా నిర్మించారని, ప్రైవేటు పరిశ్రమ వారు డంప్‌యార్డు ను కూల్చేస్తే పరిశీలించడానికి వెళ్తే అక్కడి సెక్యూరిటీ  లోనికి అనుమతించలేదని ఎంపీ వో సంతోశ్‌కుమార్ ఎంపీపీ, జడ్పీటీసీలకు తెలిపారు. గడ్డపోతారం గ్రామ పంచాయతీ నుంచి కిష్టయ్యపల్లి గ్రామాన్ని వేరు చేయాలని గడ్డపోతారం గ్రామస్తులు ఎంపీపీకి వినతి పత్రాన్ని అందజేశారు.