ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
01-06-2024 03:43 AM
పటాన్‌చెరు, మే 31 : పటాన్‌చెరు పట్టణం జేపీ కాలనీలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త, కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వార్షికోత్సవ వేడులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొలను బాల్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






