కుర్రకారు.. గుర్రాల హో(జో)రు!
శివారు ప్రాంతాల్లో యువకుల హల్‌చల్
రేసుల పేరిట స్థానికుల్లో అలజడి
బైక్‌లతో రోడ్లపై వాహనదారులకు చుక్కలు
ఆర్టీసీపై దాడికి యత్నించిన రేసర్లు
నిఘా లోపంతో రెచ్చిపోతున్న పోకిరీలు
ఒకప్పుడు సిటీకే పరిమితమైన రేసింగ్‌ల సంస్కృతి శివారు ప్రాంతాలకు పాకింది. హైదరాబాద్ మహానగరంలో రేసింగ్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో రేసర్లు తమ అడ్డాను శివారు ప్రాంతాలకు మార్చారు. పోలీసుల నిఘా ఉండని ప్రాంతాలను ఎంచుకొని రేసింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామున్నే రోడ్డంతా ఆక్రమించుకొని హల్‌చల్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ , సామాజిక మాధ్యమాల్లో రేసింగ్ వివరాలతో పాటు లొకేషన్ పోస్టు చేస్తూ పందేలకు పాల్పడుతున్నారు. రేసింగ్ సమయాలో గుంపులుగుంపులుగా వాహనాలపై వెళ్తూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. అరుపులు, కేకలు, వింతవింత హారన్లతో అలజడి సృష్టిస్తున్నారు.
రంగారెడ్డి, మే 31 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బెగరి కంచెలో ఇటీవల గుర్రాలు, బైక్ రేసర్లు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిసింది. హైద్రాబాద్ హైవే పై బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదనే కారణంతో కల్వకుర్తికి చెందిన బస్సు అద్దాలను పగలగొట్టినట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్టీసీ డ్రైవర్, ప్రయాణీకుడు మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
శివారు ప్రాంతాల్లో కొరవడిన నిఘా
సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండే స్థానిక సివిల్ పోలీసుల తో పాటు ఐబీ, టాస్క్‌పోర్స్,పెట్రోలింగ్, క్రైమ్ ఇలా పలు విభాగాలకు చెందిన పోలీసులు నిత్యం శివారు ప్రాంతాల్లో గస్తీ నిర్వ హిస్తుంటారు. చీమ చిటుక్కుమన్న క్షణాల్లో వాలిపోతుంటారు. అలాంటిది వందలాది బైక్‌లు, గుర్రాలతో అది సిటీ నుంచి శివారు ప్రాంతాలకు గుంపులుగుంపులుగా చేరుతుంటే పోలీసు లు ఏంచేస్తున్నట్లు అనే అను మానా లు వ్యక్తం అవుతున్నాయి. రేసులు జరిగే రూట్‌లో పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్, మహేశ్వరం, కందుకూరు పోలీసు స్టేషన్లు ఉంటా యి.
అయినా ఆకతాయిలను పసిగట్టడంలో పోలీసులు విఫలం చెందడం విస్మయానికి గురిచేస్తోంది. గతంలో కూడా హైద్రాబాద్ హైవేపై కారులో ప్రయాణిస్తున్న ఇబ్రహీంపట్నంకు చెందిన దంపతులకు ఇలాంటి ఘటననే ఎదురైంది. కొందరు ఆకతాయిలు వాళ్ల కారుకు బైక్‌లు అడ్డుగా నిలిపి వారితో గొడవకు దిగారు. వారిని బెదిరించి డబ్బులు ఎత్తుకెళ్లగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేసింగ్‌లో కాకుండా, శివారు ప్రాం తాల్లో గంజాయి, డ్రగ్స్, పేకాట, రేషన్ బియ్యం దందా, మట్టి మాఫి యా ముఠాలు గ్రూపులుగా సంచరిస్తూ స్థానికులను భయభ్రాం తులకు గురిచేస్తన్నారు.






