పాక్, అఫ్గాన్ మధ్య భీకర పోరు
పాకిస్థాన్ సైనిక పోస్టులపై తాలిబన్ల మెరుపుదాడులు
కాబూల్, కాందహార్, పక్తియాల్లో బాంబులేసిన పాక్ ఫైటర్‌జెట్లు
భారీ పేలుళ్లతో మార్మోగిన నగరాలు
ఇస్లామాబాద్/ కాబూల్, ఫిబ్రవరి 28: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఘర్షణ భీరక యుద్ధంగా మారింది. పాకిస్థాన్ వైమానిక దళం ఇటీవల అఫ్గానిస్థాన్లో దాడులు చేయటాన్ని తీవ్రంగా పరిగణించిన ఆ దేశ పాలక తాలిబాన్లు.. గురువారం రాత్రి నుంచి సరిహద్దుల్లో డ్యురాండ్ రేఖ వెంబడి ఉన్న పాకి స్థాన్ సైనిక పోస్టులపై మెరుపు దాడులు మొదలుపెట్టారు. అప్పటికే పాక్ సైన్యంపై ప్రతీకార దాడులు చేయబోతున్నట్లు తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజా హిద్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
తాలిబాన్లు దా డులు ప్రారంభించిన వెంటనే పాక్ సైన్యం.. పాక్ ఫైటర్ జెట్లతో అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌తోపాటు కాందహార్, పక్తియాల్లో బాంబుల వర్షం కురిపిస్తూ విరుచుకుపడిం ది. ఆయా నగరాల్లో బాంబుల పేలుళ్ల శబ్దాలతో మార్మోగాయి. ఆకాశాన్ని దట్టమైన పొ గకమ్మేసింది. మంటలు ఎగిసిపడ్డాయి. పాక్ ఫైటర్ జెట్లు అఫ్గాన్ నగరాలపై చక్కర్లు కొ ట్టాయి. సైనిక ఘర్షణలో మృతుల సంఖ్యపై పాక్, అఫ్గాన్ భిన్న ప్రకటనలు చేశాయి.
274 తాలిబాన్ ఫైటర్లను చంపేశామని పాక్ సైన్యం ప్రకటించింది. మరో 400 మంది గాయపడ్డారని పేర్కొంది. తమ ఫైటర్లు 8 మందే మృతిచెందారని జబీహుల్లా ప్రకటించారు. 27 అఫ్గాన్ సైనిక పోస్టులను ధ్వంసం చేసి, తొమ్మిదింటిని స్వాధీనం చేసుకున్నామని పాక్ సైన్యం పేర్కొంది. తమ దాడుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించారని, సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన 19 పోస్టులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబాన్లు తెలిపారు.
అయితే, తమ సైనికులు ఇద్దరే మరణించారని పాక్ అధికా రులు తెలిపారు. అఫ్గానిస్థాన్‌తో పూర్తిస్థా యి, ప్రత్యక్ష యుద్ధం మొదలైందని పాక్ రక్ష ణ మంత్రి ఖవాజా ముహ్మద్ ఆసిఫ్ ప్రకటించారు. ‘అఫ్గానిస్థాన్ నుంచి నాటో వెళ్లిపోయి న తర్వాత తాలిబాన్లు అఫ్గానిస్థాన్ ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రాంతంలో సుస్థిరత కోసం కృషి చేస్తారని ఆశించాం. కానీ, మా దేశంలో దాడులు చేస్తున్న తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ), ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర వాదులకు అఫ్గాన్ స్థావరంగా మారింది.
ఇక మా ఓపిక నశించింది. ఇప్పుడిక మీతో (అఫ్గానిస్థాన్) పూర్తిస్థాయి యుద్ధమే’ అని స్పష్టంచేశారు. పాక్‌తో యుద్ధం వేళ.. అఫ్గానిస్థాన్ పాలకులు పూర్తిస్థాయి ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాంబులు అమర్చిన జాకెట్లు ధరించి, కారు బాంబులతో తమ ఆత్మాహుతి దళం సిద్ధంగా ఉందని తాలిబాన్ల డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ చెప్పినట్లు సమాచారం. కాగా, సైనిక ఘర్షణలను వెంటనే ఆపాలని రెండు దేశాలకు ఇరా న్ సూచించింది. పాక్, అఫ్గాన్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమని తెలిపింది.
ఎఫ్16 ఫైటర్ జెట్ను కూల్చేశాం
తమ దేశంలో దాడులకు ప్రయత్నించిన పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చే శామని తాలిబాన్లు ప్రకటించారు. అయితే, ఆ విమానాన్ని దేనితో కూల్చేశారన్న వివరాలు తెలపలేదు. విమాన శకలాల ఫొటో లు కూడా బయటపెట్టలేదు. ఈ ప్రకటనను పాక్ ఖండించింది. మరోవైపు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌తోపాటు రావల్పిండి, అబొటాబాద్ తదితర నగరాలపై వైమానిక దాడులు చేసినట్లు తాలిబాన్లు పేర్కొన్నారు.
దౌత్యంతోనే వివాదాలు పరిష్కరించుకోవాలి: చైనా, రష్యా
అఫ్గాన్‌తో ఉద్రిక్తల నేపథ్యంలో తుర్కియే, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిస్థితులను వారికి వివరించారు. ప్రస్తుత పరిణామాలపై చైనా, రష్యా ఆందోళనలు వ్యక్తం చేశాయి. దౌత్య మార్గాల్లోనే వివాదాలు పరిష్కరించుకోవాలని పాక్, అఫ్గాన్‌ను కోరాయి.




