15.4 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు
ముంబై, జూన్ 6: తాజాగా ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 13 శాతం వృద్ధిచెంది 15.4 కోట్లకు చేరినట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. కొవిడ్ ముంద స్తు స్థాయిని అధిగమించినట్టు వెల్లడిం చింది. 2020 ఆర్థిక సంవత్సరంలో 14.2 కోట్ల మంది ప్రయాణీకులు దేశీయ విమానాల్లో రాకపోకలు సాగించారు. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ విమానాల్లో అంతర్జాతీయ పాసిం జర్ ట్రాఫిక్ 2.97 కోట్లకు పెరిగిందని, అంతక్రితం ఏడాదితో పోలిస్తే 24 శాతం వృద్ధి కనపడిందని ఇక్రా వివరించింది.
ముగిసిన మే నెలలో దేశీయ విమానాల్లో ప్రయాణీకుల సంఖ్య 5.1 శాతం పెరిగిం దని ఇక్రా తెలిపింది. కొవిడ్ ముందస్తు స్థాయికంటే ఇది 14 శాతం అధికమని వెల్లడించింది. దేశీయ, విదేశీ ప్రయాణీ కుల ట్రాఫిక్ పెరుగుతున్నదని, ఇదే ట్రెం డ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనసాగు తుందని అంచనా వేస్తున్నట్టు గురువా రం ఇక్రా విడుదల చేసిన నివేదిక తెలిపిం ది. ఎయిర్‌లైన్స్ వినియోగ సామర్థ్యం మే నెలలో గత ఏడాది ఇదేనెలతో పోలిస్తే 6 శాతం పెరిగిందని, 2024 ఏప్రిల్‌కంటే 2 శాతం వృద్ధిచెందిందని వివరించింది.






