18 July, 2026 | 6:16 PM

Breaking News

ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •  

15 ఏళ్ల బంధం.. ఇక జీవితాంతం

28-11-2024 12:48 AM

ఇండస్ట్రీలో వరుస పెళ్లి వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. నాగచైతన్య, శోభితల పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్‌గా నడుస్తుండగానే.. అఖిల్ నిశ్చితార్థం షాక్‌కు గురి చేసింది. మరోవైపు హీరోయిన్ కీర్తి సురేష్ సైతం తన రిలేషన్‌షిప్ వ్యవహారంపై అధికారిక ప్రకటన చేశారు. తన ప్రియుడు, కాబోయే భర్తతో దీపావళి వేడుకల్లో భాగంగా తీసుకున్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. తమ 15 ఏళ్ల బంధం జీవితాంతం సాగనుందంటూ పోస్ట్ పెట్టారు.

దీనిపై సెలబ్రిటీలతో పాటు అభిమానులంతా స్పందిస్తున్నారు. కీర్తి జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కీర్తి సురేష్ ‘గీతాంజలి’ అనే మలయాళ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆపై ‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అనంతరం తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటించారు.

’మహానటి’ సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఇక కీర్తి సురేష్‌కు కాబోయే భర్త విషయానికి వస్తే.. దుబాయ్‌లో బిజినెస్‌లు, ఇండియాలోనూ కొన్ని రిసార్ట్స్, కేరళలోనూ కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం కీర్తి ‘రివాల్వర్ రీటా’, ‘బేబీ జాన్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘బేబి జాన్’తో కీర్తి బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు.