18 July, 2026 | 6:37 PM

Breaking News

విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •  

మిస్టరీ థ్రిల్లర్.. టర్నింగ్ పాయింట్

28-11-2024 12:40 AM

త్రిగుణ్ హీరోగా, హెబ్బాపటేల్, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘టర్నింగ్ పాయింట్’. ఈ సినిమాను కుహన్ నాయుడు దర్శకత్వంలో స్వాతి సినిమాస్ పతాకంపై సురేశ్ దత్తి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ టీజర్‌ను హీరో అల్లరి నరేశ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. “టర్నింగ్ పాయింట్’ సినిమా కెరీర్‌కు కమర్షియల్ సక్సెస్‌తో త్రిగుణ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని అకుంటున్నా’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ..

‘ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలోని మర్డర్ మిస్టరీ సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి’ అని తెలిపారు. రాశి, చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామకృష్ణ, మల్లేశ్, సంగీతం: ఆర్‌ఆర్ ధృవన్, కెమెరా: గరుడ వేగ అంజి.