2 May, 2026 | 2:30 AM

మే డే స్ఫూర్తితో లేబర్ వ్యతిరేక చట్టాలు రద్దుకు పోరాటం

02-05-2026 01:23 AM

మఠంపల్లి, మే 1: శుక్రవారం సిఐటియు,సిపిఎం ఆధ్వర్యంలో మఠంపల్లి మండల కేంద్రంలో వివిధ రంగాల కార్మికులతో కలిసి మే డే వేడుకలు  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భూక్యా పాండు నాయక్ మాట్లాడుతూ మే డే స్ఫూర్తితో లేబర్ వ్యతిరేక చట్టాలను రద్దుకు పోరాటం చేస్తామని, అమెరికా దేశం చికాగో నగరంలో 1886 సంవత్సరం మే 1న పని గంటల కోసం కార్మికులు చేపట్టిన సమ్మె సందర్భంగా ఆనాటి పాలకుల ఆదేశాలతో చికాగో నగరంలోని హే మార్కెట్ లో కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు కార్మికులు మరణించారని అనేక మంది కార్మికులు రక్తం చిందించారని దీని ఫలితంగా మరణించిన కార్మికులను స్మరిస్తూ 1989లో రెండవ ఇంటర్నేషనల్ సమావేశంలో అంతర్జాతీయంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి మెరుగైన పని పరిస్థితుల కొరకు పోరాడే ధినంగా మేడేను జరపాలని పిలుపునిచ్చారని ఆనాటి నుండి మేడేను కార్మిక వర్గం దీక్షా దినంగా పాటిస్తూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎస్.జగన్ మోహన్ రెడ్డి,మాలోతు బాలు నాయక్, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కోటేశ్వరి మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.