కార్మిక హక్కుల కోసం ప్రభుత్వం కృషి
మేయర్ చైతన్య
నల్లగొండ టౌన్, మే 1: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మేడే సందర్భంగా శుక్రవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఐఎన్టియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిర్వహించిన మేడే ఉత్సవాలలో ఆమె పాల్గొని జెండాను ఎగరవేసి మాట్లాడారు.
శ్రమజీవుల పోరాట ఫలితమే ’మే’డే అని అన్నారు. హక్కుల సాధన కోసం కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నారని తెలిపారు.కార్మికులు పోరాడి సాధించుకునే హక్కులను కేంద్రం ప్రభుత్వం కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,. డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ , కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న, నల్గొండ అధ్యక్షుడు పెరిక కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.






