పది పరీక్షల్లో 594 మార్కులు సాధించిన వరుణ్‌తేజ్‌కు అభినందనలు
కోదాడ మే 1: పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మోతే మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న తిప్పని ఆంజనేయులు, జ్యోతిల కుమారుడు తిప్పని వరుణ్ తేజ్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. వరుణ్ తేజ్ 594 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో నాలుగవ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఈ అరుదైన విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం కటకొమ్ముగూడెం రోడ్డులోని లిఖిత హోమ్స్ కాలనీ వాసులు విద్యార్థిని, తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ విద్యార్థి కష్టపడి చదివిన తీరును అభినందించి, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కిరణ్, పోకల వీరబాబు, ఉపేంద్ర చారి, రామయ్య, శ్యామ్, ఎంఎల్‌ఎన్ రెడ్డి, పత్తిపాక జనార్ధన్,మాజీ గ్రంథాలయ చైర్మన్ రహీం, డి వో ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.






