26 February, 2026 | 7:18 AM

బీసీల హక్కుల కోసం పోరాటం

26-02-2026 01:56 AM

కామారెడ్డి డిక్లరేషన్ మరిచిన కాంగ్రెస్

టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఆలేరు నియోజకవర్గంలో పర్యటన

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో బుధవారం టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పర్యటిం చారు. తుర్కపల్లి మండలంలోని 12 గ్రామాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఎగురవేశారు. తుర్కపల్లి మండలం కేంద్రంలో టీఆర్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తుర్కపల్లి మండలంలోని చిన్న లక్ష్మాపురం, బద్దుతండ, మల్కాపూర్ బిల్యానాయక్ తం డా, వెంకటాపూర్ తుర్కపల్లి, వీరారెడ్డిపల్లి, తిరుమలాపూర్, వాసాలమర్రి, కొండాపూ ర్, గోపాల్ పురం, నాగాయిపల్లి గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగురవేశారు.

అనంతరం, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్లన్న సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. కాంగ్రె స్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయకుండా తడి గుడ్డతో బీసీల గొంతు కోసినట్టుగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు.

బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బీసీలకు ఎస్సీ, ఎస్టీ తరహాలో చట్టబద్ధ రక్షణలు కల్పించాల్సిన అవసరం ఉందని, రాజకీయ ప్రాతినిధ్యంలో న్యాయం జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరా రు. బీసీల స్వరాన్ని ఎత్తి చూపుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని, కానీ వారి బెదిరింపులకు భయపడబోనని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో టిఆర్పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్ గౌడ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబొయిన ఓదేలు యాదవ్, రాష్ట్ర ఉప కోశాధికారి కొక్కలకొండ మనోజ్, కార్యదర్శులు పసల ప్రసన్న కుమారి, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి కొమ్రిశెట్టి నర్సింహులు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బిక్కు నాయక్, నాయకులు మోత్కుపల్లి రఘు, మహిళా నా యకురాలు చింతకింది కీర్తీ పాల్గొన్నారు.

వాసాలమర్రి ప్రభుత్వ బడిపై ఆగ్రహం

మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామంగా ప్రచారం పొందిన తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేసిన ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను మల్లన్న పరిశీలించారు. ఇప్పటికీ కొత్త పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దత్తత గ్రామం అని ప్రచారం చేసుకుని పాఠశాలలను కూల్చి, పిల్లలను షెడ్లలో చదివించే పరిస్థితికి తీసుకురావడం సిగ్గుచేటు అన్నారు.

ప్రస్తుతం నడుస్తున్న పాఠశాలను సందర్శించిన మల్లన్న విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. బీసీ రాజ్యం వస్తే విద్య, వైద్యం రంగాలకు బడ్జెట్లో 50 శాతం కేటాయిస్తామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు తీసిపోని స్థా యికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పాఠశాల భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.