12 April, 2026 | 2:10 PM

వైద్యులపై దాడి జరిగితే ఆరు గంటల్లోపు కేసు పెట్టండి

17-08-2024 03:31 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 16:  ‘ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్యసిబ్బందిపై దాడులు తరచూ దాడులు జరుగుతున్నాయి. మరికొందరికి బెదిరింపులు వస్తున్నాయి. ఇలాంటి దాడులకు పాల్పడేది రోగి. లేదా రోగి వెంట వచ్చే కేర్ టేకర్లు. విధుల్లో ఉండగా ఎవరైనా దాడులకు గురైతే.. ఆసుపత్రి హెడ్ ఆరుగంటల్లోపు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసులు పెట్టాలి’ అని శుక్రవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఓ ప్రకటనలో సూచించింది. నిర్ణీత గడువులో ఫిర్యాదు చేయకపోతే అందుకు ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత వహిచాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ దవాఖానలో వైద్యురాలి అత్యాచారం హత్యపై నిరసనలు వెళ్లువెత్తుతుండటంతో ఈ ప్రకటన చేసింది.