1 August, 2026 | 5:53 PM

Breaking News

వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •  

జిస్మత్ మండీని ప్రారంభించిన సినీ నటుడు ధర్మ మహేష్

06-12-2025 11:05 PM

సినీ నటుడు, జిస్మత్ మండీ అధినేత ధర్మ మహేష్ చైతన్యపురిలో తమ రెండవ బ్రాంచ్ ప్రారంభించారు. భోజనప్రియులకు నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. సినీ నటుడు ధర్మ మహేష్ మాట్లాడుతూ తన కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో గిస్మత్ మండీ జిస్మత్ మండీ గా మారుస్తూ అతిథి రంగంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ రీబ్రాండింగ్ Gismat నుంచి Jismat కు మార్చామనీ, ఇది నాణ్యత, భావోద్వేగం మరియు వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందన్నారు.

భావోద్వేగపరంగా, ఈ పరివర్తన మరింత లోతుగా సాగుతుందనీ,. ధర్మ మహేష్ కంపెనీ యొక్క మొత్తం యాజమాన్యాన్ని కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నాడన్నారు. ఆ పరివర్తన పూర్తయ్యే వరకు, కార్యకలాపాల విస్తరణను పర్యవేక్షిస్తునామనీ చెప్పారు. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల ప్రతి చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగి ఉంటాయనీ, మేము అందించే రుచి, నాణ్యత మరియు ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయన్నారు. ఈ పరిణామం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్‌ ను బలోపేతం చేస్తుందన్నారు.