calender_icon.png 7 December, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతీకారం తీర్చుకునే వెంకటలచ్చిమి

06-12-2025 12:20:54 AM

‘ఆర్‌ఎక్స్ 100’ ‘మంగళవారం’ వంటి సినిమాలతో యువ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది పాయల్ రాజ్‌పుత్. ఈసారి ఆమె ‘వెంకటలచ్చిమి’గా సినీప్రియుల ముందుకు రాబోతోంది. ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సినిమా టికెట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజా, పవన్ బండ్రెడ్డి నిర్మిస్తున్నారు. కథానాయకి పాయల్ రాజ్‌పుత్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా నుంచి టీమ్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

చేతికి సంకెళ్లు, మెడలో మంగళసూత్రం, ఒంటి నిండా రక్తపు మరకలతో జైలుగదిలో పైకప్పునకు తలకిందులుగా వేలాడిదీసినట్టుగా ఉన్న కథానాయకి పోస్టర్ భయానకంగా ఉంది. ఆదివాసీ మహిళ ప్రతీకార కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయని దర్శకుడు పేర్కొన్నారు.

ఈ కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమా తర్వాత తనను ప్రేక్షకులు వెంకటలచ్చిమి అనే పేరుతో పిలుస్తారని, అంత బలమైన భావోద్వేగాలుంటాయని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది. పాన్ ఇండియా స్థాయిలో 6 భాషల్లో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బడిశ; డీవోపీ: రాహుల్ మాచినేని; ఎడిటర్: మార్తాండ్ వెంకటేశ్.