18 July, 2026 | 12:48 AM

పెద్దకాపర్తి బీసీ హాస్టల్లో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

18-07-2026 12:48 AM

విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన సర్పంచ్ కాటం వెంకటేశం

చిట్యాల, జులై 17 : మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో గల బీసీ హాస్టల్లో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు విద్యార్థులకు శుక్రవారం నోట్బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్, విద్యార్థులతో కలిసి ఉదయం అల్పాహారం చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించి,

విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పాఠ్యపుస్తకాలు, దుస్తులు తదితర సౌకర్యాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అలాగే, నకిరేకల్ శాసనసభ్యుడు , ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో బీసీ హాస్టల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహకారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా హాస్టల్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని సర్పంచ్ తెలిపారు.