10-11-2025 01:17:28 AM
వేములవాడ టౌన్, నవంబర్ 09(విజయ క్రాంతి): వేములవాడ రాజన్న సన్నిధి ఆధ్యాత్మిక వాతావరణంలో సినీ ప్రముఖు లు దర్శనాలు చేసుకున్నారు.స్థానిక సినీ న టుడు వారాల దేవయ్య సహకారంతో, వెం డి తెర హాస్యనటుడు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ రచ్చ రవి తన నటించిన చిత్రం, నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినే షన్లో రూపొందుతున్న అఖండ 2 సినిమా ఘన విజయం సాధించాలని, కుటుంబ స మేతంగా బద్ది పోచమ్మ తల్లి, రాజరాజేశ్వర స్వామి, భీమన్న స్వామి వారికి ప్రత్యేక పూ జలు నిర్వహించారు.
ఈ సందర్బంగా రచ్చ రవితో పాటు సినీ నటుడు, విలన్ పాత్రదారి తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్టు యూనియన్ జాయింట్ సెక్రటరీ కె. రామ్ మోహన్ కూడా పాల్గొన్నారు.వేములవాడ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన సందర్భంగా, వారాల దేవయ్య రచ్చ రవి రామ్ మోహన్ల ను ఘనంగా సన్మానించి, తమ కృతజ్ఞతలు తెలియజేశారు.