10-11-2025 01:19:08 AM
శంకరపట్నం,నవంబర్9(విజయక్రాంతి): కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో శంకరపట్నం మండలం గద్దపాక డె యిరీ సభ్యులకు పాలక్యాండ్ల పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ గద్దపాకలో మహిళల ఆధ్వర్యంలో పాలకేంద్రం నిర్వహించడం అభినం దనీయమన్నారు. గతంలో మూలపడ్డ పాల కేంద్రాన్ని మళ్లీ తెరిచి మహిళల ఆధ్వర్యంలో పాల సేకరణ చేస్తూ కేంద్రాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న అధ్యక్షులు, పాలకవర్గాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలకేంద్రం అధ్యక్షురా లు జక్కుల పద్మ, నిర్వాహకులు పలకల శ్యాంసుందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు తదితరులుపాల్గొన్నారు.