calender_icon.png 10 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి

10-11-2025 01:11:33 AM

చండూరు/ మర్రిగూడెం, నవంబర్ 9 (విజయ క్రాంతి): వరి ధాన్యం కొనుగోలును వెంటనే ప్రారంభించి, మద్దతు ధర పొందాలని రైతు సంఘం రాష్ర్ట కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం మర్రిగూడ మండలం శివన్న గూడెం  గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యం వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పోశారనీ, అయితే నేటికీ ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు ప్రారంభించకపోవడం రైతాంగాన్ని తీవ్రంగా నిరాశపరుస్తోందని అన్నారు.

రైస్ మిల్లుల కేటాయింపు ఇప్పటికీ జరగలేదని, రైతులు మాచర్ వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  ఇప్పటికే పత్తి పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, పెట్టుబడులు తిరిగి రాని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఇవ్వకపోవడం రైతులపై పెద్ద భారమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో  ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య రైతు సంఘం మండల నాయకులు మైల నాయకులు సత్తయ్య. డివైఎఫ్‌ఐ మండల నాయకులు ఏరుకొండ రాఘవేంద్ర ప్రజానాట్యమండలి మండల నాయకులు గడ్డం రాంబాబు రైతులుఎరుకలి బిక్షం.. నీలకంఠం శివ  జంగయ్య రాములు నరసింహ తదితరులు పాల్గొన్నారు.