4 April, 2026 | 4:35 AM

రాయలసీమ షెడ్యూల్ ముగించారు!

04-04-2026 02:46 AM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను 1850 నుంచి 70ల మధ్య జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ‘రణబాలి’గా విజయ్, అతని భార్య జయమ్మగా రష్మిక నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్, ‘ఏందయ్య సామి’ పాటకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు రాయలసీమలో జరిగింది.

రాయలసీమ షూటింగ్ పూర్తయ్యిందని తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ భావోద్వేగభరిత వీడియోను కొత్త జంట విజయ్, రష్మిక ఒకేసారి ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. అక్కడి అభిమానులు, ఆ ప్రాంతం తో తమకు ఏర్పడిన బంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం విజయ్, రష్మిక రాయలసీమ వెళ్లినప్పుడు అక్కడ వాళ్లకు లభించిన ఘన స్వాగతం, భారీ పూలమాలలు, ర్యాలీలు, దైవ దర్శనాలను ఈ వీడియోలో చూడొచ్చు. సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించే విజువల్స్ కూడా ఇందులో ఉన్నాయి.