06-02-2026 12:22:16 AM
మృత్యుంజయుడికి అశ్రుతర్పణం
కదిలిన జనం.. కన్నీరైన మంథని
వేలాదిమంది అశ్రునయనాల మధ్య కాటి వరకు కన్నీటి యాత్ర
తుపాకీ తూటాలకు బెదరని సింహం.. అనంతలోకాలకు పయనం
ముత్తారం, ఫిబ్రవరి ౫,(విజయక్రాంతి): మంథని మాజీ ఎమ్మెల్యే ప్రజా నాయకుడు చందుపట్ల రాంరెడ్డి అంతిమ యాత్ర గురువారం అత్యంత శోకతప్త హృదయాల మధ్య సాగింది. తన రాజకీయ ప్రస్థానంతో నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వే సుకున్న ఈ ‘మృత్యుంజయుడి’కి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు వే లాదిగా తరలివచ్చారు.
హైదరాబాద్ నుండి స్వగృహానికి.. కన్నీటి స్వాగతం
మంగళవారం హైదరాబాద్లోని ఆసుపత్రిలో కన్నుమూసిన రాంరెడ్డి భౌతిక కాయా న్ని బుధవారం రాత్రి మంథనిలోని ఆయన స్వగృహానికి తరలించారు. అప్పటికే వేచి ఉన్న వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయన భౌతిక కాయాన్ని చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రంతా ప్రజ లు ఆయన నివాసం వద్ద బారులు తీరి నివాళులర్పించారు.
రాజకీయ దిగ్గజాల పరామర్శ
రాష్ట్ర మంత్రు దుద్దిల్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, మాజీ జడ్పిటిసిలు నాగినేని జగన్మోహ న్ రావు, మైదం భారతి వరప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి, రాష్ట్ర నాయకులు నల్లా మనోహర్ రెడ్డి, బ్లాక్ కాం గ్రెస్ మంథని అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్తోపాటు పలువురు రాంరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంథని రాజకీయాల్లో రాంరెడ్డి ఒక ధైర్యవంతుడైన నేతగా గుర్తింపు పొందారని, ఆయన మరణం నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. రాంరెడ్డి సతీమణి సుమతి రెడ్డి, కుమారులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డిలను మంత్రి ఓదార్చారు.
మంథని నుంచి సీతంపేట వరకు..
గురువారం ఉదయం మంథనిలోని ఆ యన నివాసం నుండి అంతిమ యాత్ర ప్రా రంభమైంది. రాంరెడ్డి పార్థివ దేహాన్ని పూల తో అలంకరించిన వాహనంలో ఉంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ‘రాంరెడ్డి అమర్ రహే.. జోహార్ రాంరెడ్డి’ అంటూ అభిమానులు చేసిన నినాదాలు మిన్నంటాయి.
గ్రామగ్రామాన నివాళులు:
ఈ యాత్ర మంథని మండలం సూరయ్యపల్లి, కాకర్లపల్లి, రామకృష్ణాపూర్ గ్రా మాల మీదుగా సాగింది. ప్రతి గ్రామంలో నూ ప్రజలు రోడ్ల పైకి వచ్చి తమ మాజీ ఎమ్మెల్యేకు కన్నీటి నివాళులు అర్పించారు.
ముగిసిన ప్రయాణం:
చివరగా ముత్తారం మండలం సీతంపేట (సీతంపల్లి) లోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి పార్థివ దేహం చేరుకుంది. అక్కడ కు టుంబ సభ్యులు, బంధువుల రోదనల మ ధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
మూగబోయిన మంథని
ఒక సామాన్య సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే వరకు ఎదిగి, ఎన్నో ఆపదలను, చివరకు మృత్యువును సైతం ఎదిరించిన రాంరెడ్డి ప్రస్థానం నేటితో ముగిసింది. ఆయ న మరణంతో మంథని నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు ఆయన సేవలను స్మరించుకుంటూ ఈ కన్నీటి యాత్రలో భాగస్వాములయ్యారు.