14 August, 2026 | 1:53 AM

తుది కూర్పే సవాల్

14-08-2026 12:04 AM

ప్లేయింగ్ ఎలెవన్‌పై గంభీర్ తర్జన భర్జన

శ్రీలంకతో తొలి టెస్టుకు భారత తుది జట్టు కూర్పు సవాల్‌గా మారింది. మూడోస్థానంలో ఎవరు ఆడబోతున్నారు...నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయమేనా.. ఇద్దరే పేసర్లను తీసుకుంటే ఎవరిని బెంచ్‌కు పరిమితం చేస్తారు... ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. అటు కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ వీటిపైనే తర్జన భర్జన పడుతున్నారు.

  1. మూడో స్థానంలో ఎవరు ?
  2. నలుగురు స్పిన్నర్లతో ఆడే ఛాన్స్ 
  3. సర్ఫరాజ్‌కు చోటు దక్కేనా ?

గాలే, ఆగస్టు 13 : శ్రీలంకతో తొలి  టెస్ట్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. గాలే వేదికగా శనివారం నుంచి ఈ మ్యాచ్ ప్రా రంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు కూర్పు సవాల్‌గా మారిం ది. మూడో స్థానంలో ఎవరు ఆడాలి అనేదానిపై,  పేస్, స్పిన్ విభాగాల ఎంపికలో వ్యూ హాత్మక తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. గత వారం శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన 3 రోజుల వార్మప్ మ్యాచ్‌లో కెప్టెన్ గిల్ పరిమితంగానే పాల్గొన్నప్పటికీ, బ్యాటింగ్ ఆర్డర్‌లో తన నాలుగో స్థానంలోనే అతను బరిలోకి దిగబోతున్నాడు.

ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో టీ మిండియా నంబర్ 3 స్థా నంలో దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. పైగా వార్మప్ మ్యాచ్‌లో అ తను సెంచరీ బాది ఫా మ్ కూడా నిరూపించుకున్నాడు.  సర్ఫరాజ్ ఖాన్‌ను తుది జట్టు లోకి తీసుకుంటే  ఏ స్థానంలో ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. నాలుగో స్థా నంలో గిల్, ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాట ర్ రిషబ్ పంత్, ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా ఆడబోతున్నారు.

ఏడవ స్థానంపై మాత్రం కాస్త ఉత్కంఠ నెలకొంది. శ్రీలంక టూర్‌లో భార త జట్టు లో ధ్రువ్ జురెల్ మరొక స్పెషలిస్ట్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఉన్నాడు.   సారాన్ష్ జైన్ ఆల్ రౌండర్‌గా అందుబాటులో ఉన్నా డు. సారాన్ష్ స్పిన్-బౌలింగ్ ఆల్-రౌండర్, బ్యా టింగ్ కూడా చేస్తాడు. గాలే పిచ్ సాంప్రదాయకంగా స్పి న్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. ఈనేపథ్యంలో టీమిం డియా మేనేజ్ మెంట్ ము గ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల వ్యూహం తో బరిలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

జడేజా, కుల్దీప్ యా దవ్‌లతో పాటు యువ స్పి న్నర్లు మానవ్ సుతార్, స రాంశ్ జైన్లలో ఒకరికి లేదా ఇద్దరి కీ తుది జ ట్టులో అవకాశం దక్కవచ్చు. టీ మిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చేసిన వ్యా ఖ్యలు  దీనినే బలపరుస్తున్నాయి. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు. ఈ ముగ్గురి బౌలింగ్ శైలి భిన్నంగా ఉం డటం టీమిండియాకు అదనపు బలం కానుంది.  వీరి బౌ లింగ్‌లో వైవిధ్యం ఉంది. ప రిస్థితులను బట్టి కెప్టెన్ శుభ్మన్ గిల్ వారిని ఎలా ఉపయోగిస్తాడనేదే ముఖ్యమనీ మోర్కెల్ చెప్పుకొ చ్చాడు. గాలె టెస్టులో టీమిండియా స్పిన్ బలాన్నే ప్రధాన ఆయుధంగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల్దీప్, జడేజా, సుతార్ ముగ్గురినీ ఆడిస్తే భారత బౌలింగ్ దాడి మరింత వైవిధ్యంగా మారనుం ది.

భారత్ తుది జట్టు అంచనా :

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీం ద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యా దవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్/ప్రసిద్ధ్ కృష్ణ.