10 July, 2026 | 8:55 PM

Breaking News

ఆరవ వార్డు కౌన్సిలర్ భాకం సాయి కిరణ్ ఔదార్యం

10-07-2026 08:07 PM

5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డులో వింత వ్యాధితో బాధపడుతున్న బాలుని కి ఆర్థిక సహాయం అందజేసి, నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న ఆరవ వార్డు కౌన్సిలర్ భాకం సాయికిరణ్. ఆరవ వార్డు కు చెందిన నిరుపేద కుటుంబం సిరికొండ నందిని కుమారుడు సిరికొండ మన్విత్ గత సంవత్సర కాలంగా కవాసకి అనే వింత వ్యాధితోబాధపడుతున్నాడు. నందిని నిరుపేద కుటుంబానికి చెందినది కావడంతో వారి కుటుంబం ఆరవ వార్డు కౌన్సిలర్  సాయికిరణ్ ను ఆశ్రయించగా, గత కొంతకాలంగా ఆసుపత్రికి వెళుతూ చికిత్స చేయించుకుంటున్నారు.

నందిని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగు లేకపోవడంతో శుక్రవారం ఆరవ వార్డు కౌన్సిలర్ భాకంసాయికిరణ్ 5000 రూపాయల ఆర్థిక సహాయంఅందజేయాల్సిందిగా అనుచరులైన, ఆరేపల్లి కిరణ్, న్యాతరి దేవేందర్, ఆరెపల్లి హేమను రాజు చిలుముల స్టాలిన్ కు సూచించగా, వారి నివాసానికి వెళ్లి తక్షణసహాయంగా,5000 రూపాయలు అందజేశారు. తర్వాత చికిత్సకు అవసరమయ్యే డబ్బులను తాను సమకూర్చుతానని వారి కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. మన్విత్ ఆరోగ్యం నిలకడగా ఉండే అంతవరకు వారి కుటుంబానికి అండగా ఉంటానని భాకం,సాయికిరణ్ తెలిపారు. నందిని తల్లి తోపాటు నందిని సొంత ఇల్లు లేకపోవడంతో కిరాయి ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కాలనీవాసులు కోరుతున్నారు.