10 July, 2026 | 9:49 PM

బెల్ట్ షాపులపై స్పష్టమైన వైఖరి తెలియజేయకపోతే ఉద్యమం తప్పదు

10-07-2026 08:25 PM

మీ తీర్మానం చేసి నేటికి 24 రోజుకు అవుతున్న అమలు కానీ బెల్ట్ షాపుల నిర్మూలన

స్వప్రయోజనాల కోసం తీర్మానాలు చేసి ఊరుకుంటే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు

పాత్రికేయల సమావేశం సందర్భంగా సిపిఎం పార్టీ స్పష్టత

భద్రాచలం (విజయక్రాంతి): మద్యం బెల్ట్ షాపులపై గ్రామపంచాయతీ స్పష్టమైన వైఖరి తెలియజేయకపోతే క్షేత్రస్థాయి ఉద్యమం తప్పదని సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ హెచ్చరించింది. విలేకర్ల సమావేశం సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ... భద్రాచలం పట్టణంలో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతోందని దాన్ని కట్టడి చేసేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం బెల్టు షాపుల నిర్మూలన తీర్మానం చేయడం అభినందనీయమని అన్నారు. తీర్మానం చేసి 24 రోజులవుతున్న బెల్ట్ షాపులు మూతపడలేదని తీర్మానం అమలకు నోచుకోలేదని అన్నారు. స్వప్రయోజనాల కోసం తీర్మానాలు చేసి ఊరుకుంటే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు.