10 July, 2026 | 9:52 PM

సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి

10-07-2026 08:20 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం కార్పొరేట్ వైద్యులచే ఏర్పాటు చేయాలని టిబిజి కేఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్ రాజ్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని శుక్రవారం TBGKS నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరిఖని, రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలలో నిర్వహించినట్టుగా హైదరాబాద్ కు చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో కూడా ఏర్పాటు చేయాలనిన్నారు.

బెల్లంపల్లి చుట్టుపక్కల ఉన్న సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు, మాజీ కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఎంతైనా అవసరం ఉందన్నారు. అలాగే బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రతి వారం రావలసిన స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ మధ్యకాలంలో సరిగా రావడం లేదని అన్ని రకాల సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రతి వారం వచ్చే విధంగా చూడాలని హాస్పిటల్స్ సూపరిండెంట్, బెల్లంపల్లి జనరల్ మేనేజర్  కోరారు. అలాగే బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల, స్టాఫ్ నర్స్ ల, ఫార్మసిస్టుల, ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్రే ప్లాంట్ ఆపరేటర్ల కొరత ఉన్నదని తెలిపారు. సింగరేణిలో నోటిఫికేషన్ జారీ చేసి అన్ని రకాల పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టాలని కోరారు.

సింగరేణి కార్మికుల 12వ వేజ్ బోర్డు జూలై 1వ తేదీన ప్రారంభమైనప్పటికీ జేబీసీసీఐ కమిటీ వేయలేదని జాతీయ సంఘాలు కనీస ఉమ్మడి డిమాండ్ నోటీసు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే JBCCI కమిటీ ఏర్పాటు చేసి వేతన ఒప్పందాన్ని అమలు చేయాలనిన్నారు.ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ నాయకులు అనుముల సత్యనారాయణ, ఓరం  కిరణ్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేష్,సంఘీ ప్రశాంత్, సిహెచ్పి పిట్ కార్యదర్శి మెరుగు రమేష్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మర్రి సమ్మయ్య, నాయకులు రాజు భోగి శ్రీనివాస్,  రావుఫ్ తదితరులు పాల్గొన్నారు.