10 July, 2026 | 10:03 PM

నేర్చుకున్న శిక్షణ తరగతులలో అమలు చేయాలి

10-07-2026 08:18 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్యత శిక్షణ తరగతులను విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. మాట్లాడుతూ ఆధునిక బోధన పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులు నేర్చుకుంటూ విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను మెరుగుపరచడానికి కృషి చేయాలని తెలిపారు. మారుతున్న కాలంతో పాటు విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నాయని, వాటిని భావితరాలకు తీసుకువెళ్లాల్సిన బాల్ తో ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోర్స్ కో ఆర్డినేటర్ వెంకట రమణా రెడ్డి, జిల్లా రిసోర్స్ పర్సన్స్ శశిరాజ్, ధీరజ్, చంద్ర ప్రకాష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.