15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రారంభం

02-02-2026 05:00 PM

వాంకిడి (విజయక్రాంతి): స్థానిక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయని కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ ఎం. చంద్రయ్య తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్‌లో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యారు.

సోమవారం ఉదయం ఒకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు 36 మంది పరీక్షలు రాయగా, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 27 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 63 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వాంకిడి ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాన్ని డీఐఈఓ బి. రాందాస్, డీఐసీ మెంబర్ అనిల్ కుమార్ సందర్శించి, పరీక్షలు సజావుగా నిర్వహించబడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.