17 March, 2026 | 4:40 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

నిరుపేద అంత్యక్రియలకు రూ.20 వేలు ఆర్థిక సహాయం

16-04-2025 04:29 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని సామల వీరభద్రం అనే నిరుపేద అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందగా ఆయన అంత్యక్రియలకు కేసముద్రం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం 20 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో  లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ బోగోజు నాగేశ్వరాచారి మాట్లాడుతూ.. క్లబ్ చైర్మన్ మామిడి అశోక్ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి అండగా నిలిచేందుకు సభ్యులు ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్నం శ్రీరాములు, చింతా కరుణాకర్, పరాంకుశం శ్రీహరి, రాపాక కుమారస్వామి, రుద్ర శ్రీకాంత్, చెలమల్ల కిరణ్, కంచు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.