calender_icon.png 6 February, 2026 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాయపడిన యువకునికి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం

06-02-2026 12:00:00 AM

ఆళ్ళపల్లి ఫిబ్రవరి 5, (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి కిందపడి వెన్నుపూసకు తీవ్ర గాయమై చికిత్స పొందుతున్న నిరుపేద యువకుడు రేసు నరేష్ వైద్య ఖర్చుల నిమిత్తం కాంగ్రెస్ పార్టీ మండల కో ప్రచార కమిటీ అధ్యక్షుడు వాసం శ్రీకాంత్ అలాగే యూత్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో 30 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రేసు నరేష్ నిరుపేద కుటుంబానికి చెందిన వాడని కల్లుగీత ప్రధానవృత్తిగా చేసుకొని జీవిస్తున్నాడని అతనికి చిన్ననాడే తల్లిదండ్రులు కూడా మృతి చెందారని మానవతా దృక్పథంతో గ్రామస్తుల సహకారంతో ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళ నాయకురాలు పానుగంటి మంగ మడత కుమారి నాతి పద్మ తదితరులు పాల్గొన్నారు.