13 May, 2026 | 6:43 PM

ఆడబిడ్డ వివాహనికి ఆర్థిక సహాయం

13-05-2026 05:33 PM

చందుర్తి,(విజయక్రాంతి): స్థానిక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి ఆడబిడ్డ వివాహానికి రూ.5 వేల 116 ఆర్థిక సాయం అందిస్తానని చందుర్తి మండలం కిష్టంపేట గ్రామ సర్పంచ్ మొకానపెల్లి దేవరాజు గతం లో స్పష్టం చేశారు. గ్రామానికి చెందిన కంబోజి తిరుపతి -స్వరూప దంపతుల మూడవ కుమార్తె వివాహం జగిత్యాల లో జరిగిన పెళ్లికి సర్పంచ్ దేవరాజు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి కూతురికి అందజేశారు. ప్రతి ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, డాక్టర్ ఇస్మాయిల్,పోతుగంటి రఘుపతి, బాణాల లక్ష్మారెడ్డి, మ్యాదరి రాములు, తదితరులు పాల్గొన్నారు.