తోటి ఉపాధ్యాయుడికి ఆర్థికసాయం
17-08-2026 12:00 AM
అయిజ ఆగష్టు 16: అయిజలోని ప్రైవేట్ పాఠశాల బ్రైట్ స్టార్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బోయిల గూడెం నరసన్న గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చాలీచాలని జీతంతో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న బోయిల గూడెం నరసన్న కుటుంబఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న తోటి ఉపాధ్యాయులు 12 వేల రూపాయల నగదును అందజేశారు. తన పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్థిక సహాయం అందజేసిన తోటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జ్యోతి, అపర్ణ, సుబ్బన్న, సుభాష్ మొదలగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






