17 August, 2026 | 1:06 AM

గ్రామ అభివృద్ధే మా లక్ష్యం

17-08-2026 12:00 AM

డ్రైనేజీ పనులకు సర్పంచ్ ప్రకాష్ గౌడ్ శ్రీకారం

బాలానగర్ ఆగస్టు 16 : గ్రామ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామని గ్రామ స ర్పంచ్ తాళ్ల ప్రకాష్ గౌడ్ అన్నారు.  ఆదివా రం మండలంలోని గౌతాపూర్ గ్రామపంచాయతీలో రూ.3.80 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  డబుల్ బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్న 64 కుటుంబా లు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతు న్న విషయాన్ని ఎన్నికలకు ముందే గుర్తించి, సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చానని సర్పంచ్ తెలిపారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. డ్రైనేజీ పనులు ప్రారంభం కావడంతో డబుల్ బెడ్రూం ఇళ్ల నివాసితులు సర్పంచ్ తాళ్ల ప్రకాష్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సర్పంచ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెద్దోని యాదయ్య, వార్డు మెంబర్ సభ్యులు, రాజేశ్వరి శ్రీకాంత్, పెద్దోని రామక్రిష్ణ, జల నరేష్, పెద్దోని ప్రదీప్, గ్రామ పెద్దలు కళ్ళెం శ్రీను, బర్రె శేఖర్ ,రమేష్, రాజేష్ యాదయ్య                       తదితరులు పాల్గొన్నారు.