17 August, 2026 | 2:02 AM

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

17-08-2026 12:00 AM

అయిజ ఆగష్టు 16: అయిజ మండలంలోని సంకాపురం గ్రామంలో రామకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని రామకృష్ణ సేవా సమితి వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజీవ్ జాగిర్ధర్  మాట్లాడుతూ సుమారు 200 మందికి పైగా ఉచిత వైద్య సేవల్ని వినియోగించుకున్నారని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లు వందన, చేతన్, సాయికృష్ణ, రామకృష్ణ సేవా సమితి సభ్యులు వెంకట్ రాములు  కృష్ణా సత్యనారాయణ వీరభద్రులు మొదలగు వారు పాల్గొన్నారు.