calender_icon.png 11 November, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిత్రునికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం

11-11-2025 07:46:51 PM

స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటున్న మిత్రులు..

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన సందు వినోద్ వారి తల్లి అయిన సందు ఎల్లమ్మ, కొద్దిరోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. తల్లి తండ్రి చనిపోయిన మిత్రునికి ధైర్యంగా వారి కుటుంబానికి ఉండాలని వారికి మనోధైర్యాన్ని నింపడానికి మేమున్నాం అంటూ చిన్ననాటి మిత్రులు, కాంగ్రెస్ పార్టీ మిత్రులు అందరూ కలిసి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కొండరాజు, ఉప్పుల రాంబాబు, పెండెం రామ్మూర్తి, ఎస్ కే హసేన్, గోపగాని వెంకన్న, ఎనగందుల అఖిల్, ఎండి అబ్దుల్,అక్కినపల్లి నరేష్, సందు రామ్మూర్తి, సందు వంశీ, ఎలగందుల మణికుమార్, తదితరులు మిత్రులు పాల్గొన్నారు