calender_icon.png 11 November, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకసారి సాగు చేస్తే మూడున్నర దశాబ్దాల వరకు ఆదాయాన్నిస్తుంది..

11-11-2025 07:40:38 PM

ఆయిల్ పామ్ సాగు చేసి ప్రతి నెల నికర ఆదాయం పొందండి..

మార్కెట్ సమస్య లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో బై బ్యాక్ అగ్రిమెంట్..

మునుగోడు నియోజకవర్గ ఉద్యాన అధికారి రావుల విద్యాసాగర్..

మునుగోడు (విజయక్రాంతి): ఒక్కసారి నాటితే పంట దిగుబడి 4వ సంవత్సరం నుండి మొదలై మూడున్నర దశాబ్దాల పాటు ప్రతి నెల ఆదాయం వచ్చే ఏకైక పంట ఆయిల్ పామ్ అని మునుగోడు నియోజకవర్గ ఉద్యాన అధికారి రావుల విద్యాసాగర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఉద్యాన శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మునుగోడు పరిధిలోని రైతులతో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. భారతదేశంలో పెరుగుతున్న జనాభా తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి ఆహారంలో నిత్య అవసరం అయినా నూనె పంట ఇది, ఇప్పటికే మన దేశానికి సరిపడా నూనె పంటల సాగు లేక మనం ప్రతి సంవత్సరం సుమారు(80,000) ఎనభై వేల కోట్ల నుండి (1,20,000) ఒక లక్షా వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా నూనె కోసం మనం ఖర్చు చేస్తున్నారు.

దేశ అవసరాలకు సరిపడా నూనె లేని కారణంగా మన దేశవ్యాప్తంగా సాగుకు అవకాశం ఉన్నచోట రైతులను ప్రోత్సహించి ఆయిల్ పామ్ పంటకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకం అందిస్తుంది అని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే దిగుబడులు కూడా ప్రారంభం అయ్యాయి, ఈ ప్రాంత నేలలు అనుకూలం నీరు ఉన్న రైతులు ఆయిల్ పామ్ పంట వేయడానికి ముందుకు రావాలని సూచించారు. ఈ పంటను సాగు చేసిన రైతులకు ప్రభుత్వం తరుపున సబ్సిడీలు అందిస్తుందని తెలిపారు.

200 రూపాయలు విలువ గల మొక్కలను కేవలం 20/- లకే ఒక్కో ఆయిల్ పామ్ మొక్కను ఇస్తుంది, డ్రిప్ పరికరాలు కూడా ఎస్సీ, ఎస్టీ వంద, బీసీలకు తొంబై, ఓసీలకు యనబై శాతం రాయితీ వస్తుందని తెలిపారు. రైతులు పంట వేసిన తర్వాత ఆయిల్ పామ్ మొక్కలు పెంచినందుకు ఒక్కో ఎకరాకు  4,200/- రూపాయలను 4 సంవత్సరాల పాటు ఇస్తుంది. రానున్న రోజుల్లో మన దేశ అవసరాలు తీరాలంటే రైతులు ఆలోచనలు చేసి పెద్ద ఎత్తున రైతులు ముందుకు రావాలని కోరారు. మండలంలో 225 ఎకరాలు సాగు అవుతుంది, మునుగోడు నియోజకవర్గం లో 1600 ఎకరాలు సాగు  అయింది, పాల చౌడు నేలలు తప్ప నీరు ఉన్న ప్రతీ రైతు ఆయిల్ పామ్ సాగు చేయవచ్చునని తెలిపారు..

ఒక ఎకరం వరి సాగు అయ్యే నీటితో సుమారు 3 ఎకరాలకు వరకు సాగు చేయవచ్చు..

మునుగోడు మండల వ్యవసాయ అధికారి పద్మజా 

ఒక ఎకరం వరి సాగు అయ్యే నీటితో సుమారు 3 ఎకరాలకు వరకు ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చు అని మండల వ్యవసాయ అధికారి ఎస్ పద్మజ అన్నారు.ఆసక్తి ఉన్న రైతులు ముందుకు వచ్చి ఆయిల్ పామ్ పంటను సాగు చేయాలని తెలిపారు, మార్కెట్ సమస్య కూడా లేదు ప్రభుత్వ ఆధ్వర్యంలో బై బ్యాక్ అగ్రిమెంట్ లభిస్తుందని తెలిపారు.కాబట్టి ఆయిల్ పామ్ ద్వారా ఇప్పటికే వేసిన రైతులు చెప్పిన ప్రకారం ఎకరానికి సుమారు 1 లక్ష రూపాయల నుండి 1 లక్షా 50 వేల వరకు నికర ఆదాయం వస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు  మండల మునుగోడు క్లస్టర్ ఏఈఓ మౌనిక  డైరెక్టర్ దుబ్బ గోపాల్, మానిటరింగ్ అధికారి రేణుక, సీఈవో సుఖేందర్, సిబ్బంది అశోక్ రెడ్డి, పురుషోత్తం, స్వామినాద్, చంద్రశేఖర్, పతంజలి ఆయిల్ పామ్ ఫీల్డ్ అసిస్టెంట్ పాలకూరి స్వామి, హెచ్ఈఓ శ్రీను రైతులు ఉన్నారు.