calender_icon.png 19 July, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పావలా శ్యామలకు ఆర్థిక సాయం

27-07-2024 12:30:12 AM

ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు హీరో సాయి దుర్గ తేజ్ విరాళం అందించారు. కాగా, ఆ మొత్తంలో నుంచి కొంత నగదును అసోసియేషన్ బాధ్యులు.. దీన స్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు అందజేశారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం సాయి దుర్గ తేజ్ ఆర్థిక సహాయాన్ని చేయగా, పావలా శ్యామలకు లక్ష రూపాయలు అందజేశామని అసోసియేషన్ మెంబర్స్ తెలిపారు. ఈ సందర్భంగా శ్యామలతో తేజ్ వీడియో కాల్‌లో మాట్లాడగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తేజ్ కూడా భావోద్వేగానికి గురవుతూ, అన్ని విధాలా అండగా ఉంటామంటూ ఆమెకు భరోసా కల్పించారు.