14-11-2025 08:08:28 PM
ఆర్థిక సహాయం అందజేత
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల మున్సిపాలిటీ పెద్ద బోనాలకు చెందిన బద్దెనపల్లి నరేష్, వృత్తి రీత్యా న్యాయవాదిగా వ్యవహరిస్తూ, గత కొద్ది రోజులుగా లివర్ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్సకు అవసరమైన వ్యయభారం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న తోటి న్యాయవాదులు వెంటనే స్పందించి సహాయ హస్తం చాటారు. నరేష్ వైద్య ఖర్చుల నిమిత్తం సోదర న్యాయవాదులు అందరూ కలసి మొత్తం ₹19,000/- రూపాయలను సేకరించి సహాయంగా జమ చేశారు.
ఈరోజు నరేష్ ఇంటిని సందర్శించిన న్యాయవాదులు అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మానసిక ధైర్యం కోల్పోకుండా ఉండాలని ప్రోత్సహిస్తూ, సేకరించిన సహాయాన్ని అందజేశారు.తన పరిస్థితిని గమనించి అండగా నిలిచి ఆర్థికంగా సహకరించిన సోదర న్యాయవాదులందరికీ బద్దెనపల్లి నరేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తంగళ్లపల్లి వెంకట్, న్యాయవాదులు కడగండ్ల తిరుపతి, బర్ల శ్రీనివాస్,కర్రోళ్ల శంకర్, ఆలూరి చంద్రశేఖర్, సిరిపాక దేవరాజు, అక్కేనపల్లి అజయ్, ప్రశాంత్, దొబ్బల శ్రీనివాస్, సడిమెల శేషగిరి తదితరులు పాల్గొన్నారు.