14-11-2025 08:03:29 PM
బేల, ఇంద్రవెల్లి లో పార్టీ శ్రేణుల సంబురాలు
ఇంద్రవెల్లి, బేల,(విజయక్రాంతి): బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ విజయం సాధించడంతో పాటు బీజేపీ భారీ మెజారిటీతో గెలవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగానే ఇంద్రవెల్లి, బేల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. .బీహార్ ను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్ళేందుకు అక్కడి ప్రజలు భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించుకున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలకు మేలు జరుగుతున్నదని అన్నారు.