1 July, 2026 | 2:30 PM

మృతుడి కుటుంబానికి రూ.21 వేల ఆర్థిక సాయం

08-06-2025 04:40 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలంలోని ధనసరి గ్రామానికి చెందిన కొండ నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. కేసముద్రం జడ్పీ హైస్కూల్ లో నాగయ్యతో కలిసి చదువుకున్న 2002-03 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం మృతుడి భార్య, ఇద్దరు కూతుర్లకు 21 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిగిరి చిన్న సాంబయ్య, జక్కుల ఉదయ్, కళింగరాజు తదితరులు పాల్గొన్నారు.